ETV Bharat / state

గుంతకల్లులో రైల్వే డ్రైవర్ల నిరసన - Railway drivers protest news

అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే డివిజన్​లోని డీఆర్​ఎం కార్యాలయం వద్ద రైల్వే డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. డివిజన్​ మేనేజర్​ ఆలోక్​ తివారి వారితో మాట్లాడి.. ఆందోళన విరమించేలా చేశారు.

Railway drivers protest
ఆందోళన చేస్తున్న రైల్వే డ్రైవర్లు
author img

By

Published : Mar 31, 2021, 8:45 AM IST

అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే డివిజన్​లోని డీఆర్​ఎం కార్యాలయం వద్ద రైల్వే డ్రైవర్లు ఆందోళన నిర్వహించారు. తాము ఉద్యోగం చేస్తున్న డివిజన్​లో పనులు కల్పించకుండా.. మరో డివిజన్​లో విధులు నిర్వర్తించమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు వారు అంగీకరించకపోతే.. సస్పెండ్​ చేస్తున్నారని అన్నారు. న్యాయం చేయాలని దాదాపు మూడు గంటల పాటు నిరసన చేశారు. రైల్వే డివిజన్ మేనేజర్ ఆలోక్ తివారి వచ్చి.. రైల్వే డ్రైవర్లకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అదనపు విధుల గురించి ఇతర డివిజన్లలోని అధికారులతో చర్చిస్తామని హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు.

ఇదీ చదవండి: డ్రైవింగ్ లైసెన్సులకు నగదు వసూళ్లు.. అనిశా సోదాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.