కరోనా వ్యాప్తి నేపథ్యంలో అనంతపురం జిల్లా పుట్టపర్తిలో పూర్తి అప్రమత్తంగా ఉన్నామని శిక్షణా కలెక్టర్ జాహ్నవి స్పష్టం చేశారు. కదిరిలో విదేశాల నుంచి తిరిగి వచ్చినవారు, ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లి వచ్చిన వారి వివరాలు పూర్తిగా సేకరించామన్నారు. ప్రత్యేకించి విదేశాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్లో ఉంచామని చెప్పారు. నిత్యావసర వస్తువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని జాహ్నవి హెచ్చరించారు.
ఇవీ చదవండి: కరోనాపై పర్యవేక్షణ కమిటీ: మంత్రివర్గం ఆమోదం