ETV Bharat / state

కరోనా చుట్టేస్తున్నా.. కనికరం లేదాయె! - అనంతపురం జిల్లాలో కొవిడ్ తాజా సమాచారం

అనంతపురం జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. నిత్యం 2 వేలకుపైగా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈనెల 12న 2,185.. 13న 2,080.. 14న 2,213.. 15న 2,975 చొప్పున కేసులు నమోదయ్యాయి. దీనికి తగ్గట్టు ఆసుపత్రుల్లో సౌకర్యాలు పెరగడం లేదు. అదనపు పడకలను ఏర్పాటు చేయడం లేదు. ఐసీయూ, ఆక్సిజన్‌ పడకలే కాదు.. సాధారణ పడకలు కూడా పెంచకపోవడం బాధాకరం. పడక దొరకలేదన్న భయమే రోగులను వేధిస్తోంది. సాధారణ వైద్య సిబ్బంది పుష్కలంగా ఉన్నారు. కానీ పడకల సంఖ్యను పెంచే దిశగా ప్రణాళికలు లేకపోవడం రోగులను మరింత బాధిస్తోంది.

కరోనా ప్రభావం
covid effect
author img

By

Published : May 16, 2021, 12:15 PM IST

అనంతపురం జిల్లా వ్యాప్తంగా 61 ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులను నోటిఫై చేశారు. 56 ఆస్పత్రులను పూర్తిగా తీసుకున్నారు. కానీ.. 39 ఆస్పత్రుల్లో మాత్రమే చేరికలు సాగుతున్నాయి. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 50 శాతం పడకలే ఆరోగ్యశ్రీ కింద ఉన్నాయి. మిగతా వాటిలో ప్రైవేట్‌ యాజమాన్యాలే రోగులను చేర్చుకుని బిల్లులు వసూలు చేసుకుంటున్నాయి. ఆరోగ్యశ్రీనే కాదు.. ప్రైవేట్‌ పడకలు కూడా సకాలంలో రోగులకు అందుబాటులో లేవు. ఆస్పత్రుల సంఖ్యతోపాటు.. పడకల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. మరోవైపు అదనంగా 156 పడకలను పెంచుతున్నట్లు ఏప్రిల్‌ 30న కలెక్టర్‌ ప్రకటించారు. వీటిలో 36 ఐసీయూ పడకలు ఉన్నాయి. అయితే ఇటీవల 150 దాకా ఆక్సిజన్‌ బెడ్లు తగ్గించినట్లు సమాచారం. రోగులు పెరుగుతున్న తరుణంలో తగ్గించడంపై విమర్శలు వస్తున్నాయి.

కళ్యాణదుర్గం ఏమైంది?

జిల్లా కేంద్రంలో కీలక ఆస్పత్రుల్లో ఐసీయూ, ఆక్సిజన్‌ పడకలు పెంచడంతోపాటు.. క్షేత్ర స్థాయిలో కొన్ని ప్రాంతాల్లో తాత్కాలిక ఆస్పత్రులను ఏర్పాటు చేస్తే బాగుంటుంది. కదిరిలో ఆక్సిజన్, ఐసీయూ పడకలను పెంచాలి. గుంతకల్లు ఆస్పత్రిని మరింత పటిష్టం చేయాలి. తాడిపత్రిలో తాత్కాలిక ఆస్పత్రి ఏర్పాటుకు ముమ్మర ఏర్పాట్లు సాగుతున్నాయి. కానీ కళ్యాణదుర్గం ఆర్డీటీ ఆస్పత్రిని స్వాధీనం చేసుకుంటామని కలెక్టరు చెప్పారు. దీనిపై అతీగతీలేదు. పెనుకొండ, మడకశిర, ఉరవకొండ తదితర ప్రాంతాల్లో తాత్కాలిక కొవిడ్‌ ఆస్పత్రులను ఏర్పాటు చేయాల్సి ఉంది.

* ఏపీఎంఐపీ పీడీ సుబ్బరాయుడుకు శ్వాస పీల్చడం ఇబ్బందిగా ఉండటంతో బంధువులు శుక్రవారం అనంత నగరంలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. పడకల్లేవంటూ ఎక్కడా చేర్చుకోలేదు. ‘నేను జిల్లా అధికారిని.. దయచేసి చేర్చుకోండి’.. అంటూ పీడీ చేతులు జోడించి వేడుకున్నా ఎవరూ కనికరించలేదు. చివరకు అరవిందనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ఆక్సిజన్‌ స్థాయి 60కి పడిపోవడంతో వెంటిలేటర్‌ అవసరమైంది. అక్కడి నుంచి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇక్కడ స్ట్రెచర్‌ కోసమే అరగంట నిరీక్షించారు. ఈలోపు పీడీ కుమారుడు, కుమార్తెలు కలిసి దుప్పటిపై 2వ ఫ్లోర్‌కు మోసుకెళ్లారు. పడకపై పడుకోబెట్టిన తర్వాత పరీక్షించారు. అప్పటికే తుదిశ్వాస వదిలినట్లు వైద్యులు ధ్రువీకరించారు. జిల్లా అధికారికే ఇలా ఉంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి?’

* అనంత సర్వజన, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో వెంటిలేటర్లు దండిగా ఉన్నాయి. వాటిని ఖాళీగా పక్కన పెట్టేశారు. వీటిని వినియోగంలోకి తెస్తే మరిన్ని వెంటిలేటర్ల పడకలు అందుబాటులోకి వస్తాయి. జిల్లా యంత్రాంగం ఈ దిశగా దృష్టి సారించలేదు. ఇప్పటికైనా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

* ఏప్రిల్‌ 30న అదనంగా 156 పడకలు ఏర్పాటు చేశారు. వీటిలో 36 ఐసీయూ, 120 సాధారణం ఉన్నాయి. కానీ ఇటీవల దాదాపు 150 దాకా ఆక్సిజన్‌ పడకలను తగ్గించినట్లు తెలుస్తోంది. రోగులు పెరుగుతున్న సమయంలో తగ్గించడంపై విమర్శలు వస్తున్నాయి.

పలు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వెంటిలేటర్ల పడకలు లేవు. కదిరి మినహా.. మిగిలిన ఐదు ప్రభుత్వ ఆస్పత్రుల్లో 93 వెంటిలేటర్లు పని చేస్తున్నట్లు ‘లెక్క’ నమోదు చేశారు. హిందూపురంలో పది, సర్వజనలో 40, గుంతకల్లు 20, సూపర్‌ స్పెషాలిటీ 10, క్యాన్సర్‌ ఆస్పత్రిలో 13 చొప్పున ఉన్నాయి. సర్వజనాస్పత్రి, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో పదుల సంఖ్యలో వెంటిలేటర్లు నిరుపయోగంగా ఉన్నాయి. వీటిని అందుబాటులోకి తెస్తే చాలామంది రోగులకు ఉపయుక్తంగా ఉంటుంది.

ఇదీ చదవండి:

4 ట్యాంకర్లతో.. గుంటూరు చేరుకున్న ఆక్సిజన్​ రైలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.