ETV Bharat / state

గుట్టుగా మద్యం అమ్మకాలు.. సహకరించిన కానిస్టేబుళ్ల సస్పెన్షన్

author img

By

Published : Apr 3, 2020, 10:53 AM IST

లాక్​డౌన్ కారణంగా మద్యాన్ని అమ్మకూడదనే ప్రభుత్వ నిబంధనలను వ్యతిరేకించారు కొందరు వ్యాపారులు. వారికి మరికొందరు ఎక్సైజ్​ పోలీసులు సహకారం అందించారు. గుట్టు రట్టయ్యింది. మద్యం సరఫరా చేస్తున్న వ్యక్తులకు సహాయం చేసిన సిబ్బందిని.. పై అధికారులు సస్పెండ్ చేశారు.

Police suspended for cooperating with illegal liquor business at hindupuram in ananthapuram

అనంతపురం జిల్లా హిందూపురం గ్రామీణ మండలం మణేసముద్రం గ్రామంలో బుధవారం పట్టుబడ్డ నకిలీ మద్యం రవాణా కేసులో హిందూపురం ఎక్సైజ్ పోలీసులు పురోగతి సాధించారు. పెనుగొండ ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది.. కానిస్టేబుల్ వెంకటేష్, ప్రసాద్, చౌడయ్యలు అక్రమ రవాణాకు సహకరిస్తున్నట్టుగా గుర్తించారు. వారిని సస్పెండ్ చేశారు. వారిపై కేసు నమోదు చేసినట్టు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయ్ శేఖర్ వెల్లడించారు.

బెంగుళూరు నుంచి నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తున్న ముఠాకు ఎక్సైజ్ సిబ్బంది సహకరిస్తున్నారన్న విషయం నిర్ధారణ కావడంతో.. వారిపై శాఖాపరమైన చర్యలు చేపడతామని తెలిపారు. ప్రస్తుతం కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు.. ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేసే మరో నలుగురు కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నారని.. వారంతా పరారీలో ఉన్నారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

'నా చావుకు పోలీసులే కారణం'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.