'ఏపీ నుంచి వియత్నాంకు నేరుగా విమాన సర్వీసులు' - AP and Vietnam Tourism Conclave
🎬 Watch Now: Feature Video
AP and Vietnam Tourism Conclave: వియత్నాం - ఏపీ మధ్య పర్యాటక, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో విజయవాడలో కాన్‌క్లేవ్ నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి కందుల దుర్గేష్, వియత్నాం అంబాసిడార్ ఎంగ్యూయేన్ థాన్హయ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలు ఇక్కడి పర్యటక రంగ అవకాశాల గురించి మంత్రి దుర్గేష్ వివరించారు. రాష్ట్రం నుంచి వియత్నాంకు నేరుగా విమానసర్వీసులను VIETJET ద్వారా ప్రారంభించేందుకు చొరవ చూపుతామని వియత్నాం అంబాసిడార్ తెలిపారు. వియత్నాంలోని యునెస్కో ప్రతిపాదిత ప్రదేశాలు, ప్రాచీన భారతీయ సంస్కృతికి ముడిపడిన మరెన్నో ప్రాంతాలు భారతీయ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయని అన్నారు. E-VISA వ్యవస్థతో ప్రయాణం మరింత సులభతరం కావడంతో, రాబోయే రోజుల్లో భారతీయ పర్యాటకుల సంఖ్య ఒక మిలియన్ మార్కును చేరాలని తాము ఆశిస్తున్నామన్నారు. విభిన్నమైన పర్యాటక కేంద్రాలకు ఏపీ లోగిలిగా ఉండాలని ఈ కాన్‌క్లేవ్ ద్వారా పర్యాటకాన్ని పెంపొందించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.