ETV Bharat / state

అక్రమ ఆయుధాల కేసులో నిందితులకు 14 రోజుల రిమాండ్

Illegal Weapons case: అనంతపురం జిల్లా డీ.హీరేహాళ్ పోలీసులు అక్రమ ఆయుధాల కేసును చేదించారు. ఈ కేసులో అంతర్ రాష్ట్ర ముఠాకు చెందిన ఆరుగురిని అరెస్ట్ చేసి 18 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆరుగురు నిందితులకు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఇందుకుగాను అనంతపురం ఎస్పీ పకీరప్పతో పాటు, డీ హీరేహాల్ పోలీసులను డీజీపీ రాజేంధ్రనాథ్​రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.

పోలీసులు
పోలీసులు
author img

By

Published : Dec 27, 2022, 9:15 PM IST

Illegal Weapons case: అక్రమ ఆయుధాలు గ్యాంగ్ అరెస్ట్ అనంతపురం జిల్లా డీ.హీరేహాల్ పోలీసులు కీలక కేసును చేదించారు. ఈకేసులో ఆరుగురు నిందితులకు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. బెంగళూరుకు చెందిన కిరాయి హంతకుల ముఠా అనంతపురం- బళ్ళారి కేంద్రాలుగా కొంత కాలంగా నకిలీ నోట్లు, అక్రమ ఆయుధాల దందా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అక్రమ ఆయుధాల తయారీదారు, డీలర్​తో పాటు అంతర్ రాష్ట్ర ముఠాకు చెందిన ఆరుగురిని అరెస్ట్ చేసి 18 ఆయుధాలను స్వాధీనం చేసుకుని.. ఆ గ్యాంగ్​ను పోలీసులు రాయదుర్గం కోర్టులో హాజరు పరిచారు. అనంతరంనిందితుల దగ్గర నుంచి 18 ఇంపోర్టెడ్ రివాల్వర్లు, 95 బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మధ్యప్రదేశ్ నుంచి ఏపీ, కర్నాటక, గోవా రాష్ట్రాలకు తుపాకులు సరఫరా చేస్తున్న ముఠాగా గుర్తించారు. అత్యాధునిక ఆయుధాల విక్రయం తో పాటు డ్రగ్స్ విక్రయిస్తున్నట్లుగా తెలుస్తోంది. నిందితులపై కర్నాటక, గోవా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపారు. అనంతపురం ఎస్పీ పకీరప్పతో పాటు, డీ హీరేహాల్ పోలీసులను డీజీపీ రాజేంధ్రనాథ్​రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.

ఇదీ జరిగింది:

Illegal Arms Gang Arrest: రాష్ట్రంలో అక్రమ ఆయుధాల విక్రయాల ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. బళ్లారి, అనంతపురం కేంద్రంగా జరుగుతున్న ఆయుధాల దందాలో కీలక నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 18 ఆయుధాలను అనంతపురం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ కరెన్సీ కేసులో నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. ఆయుధాల అక్రమ తయారీ గుట్టు వెలుగులోకి వచ్చిందని డీజీపి రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.

బెంగుళూరుకు చెందిన రౌడీషీటర్లను విచారించగా.. మధ్యప్రదేశ్​లో తయారీ కేంద్రం ఉందని వెల్లడించారు. జంషీద్, ముబారక్, రియాజ్, అమీర్ పాషా అనే బెంగుళూరు ముఠాను అరెస్ట్ చేశారు. వీరితో పాటు ఆయుధాలు తయారు చేస్తున్న రాజ్​పాల్ సింగ్ అనే కీలక నిందితుడిని అరెస్ట్ చేసినట్లు డీజీపి తెలిపారు. గతంలో హత్యలు, నకిలీ కరెన్సీ చలామణి, ఆయుధాల విక్రయాలు, గంజాయి స్మగ్లింగ్ చేసినట్లు గుర్తించామన్నారు. అనంతరపురం ఎస్పీ ఫకీరప్ప ఆధ్వర్యంలో స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేశామన్నారు. 18 ఆయుధాలు, 95 రౌండ్ల బుల్లెట్లు, 6 అదనపు మ్యాగజైన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటిలో 9ఎంఎం ఫిస్టల్స్, తపంచా, రివాల్వర్లు ఉన్నాయన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.