గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు వెంబడించి పట్టుకున్న ఘటన అనంతపురం జిల్లాలో(police caught ganja selling youngsters in anantapur district kadiri) జరిగింది. కదిరిలోని తేరు బజారులో ఇద్దరు యువకులు స్థానిక యువకులకు అక్రమంగా తెచ్చిన గంజాయిని విక్రయిస్తున్నారు. అదే సమయంలో అటుగా ఇద్దరు పోలీసులు వచ్చారు. వారిని చూసిన యువకులు ఒక్కసారిగా పరుగు పెట్టారు. దీంతో వారిపై సందేహం కలిగిన పోలీసులు.. యువకులను పట్టుకునేందుకు యత్నించారు. తప్పించుకునేందుకు పారిపోతున్న యువకులను.. స్థానికులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఎట్టకేలకు పోలీసులు, స్థానికులు వారిద్దరినీ చుట్టుముట్టి పట్టుకున్నారు. పోలీసులకు చిక్కిపోయామని భావించిన యువకులు తమ వద్ద ఉన్న పేపర్లు నలిపి పడేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని స్టేషన్‌కు తరలించి విచారణ చేస్తున్నారు.
50 కిలోల గంజాయి పట్టివేత..
విజయనగరం జిల్లా మెంటాడ మండలం పిట్టాడ చెక్ పోస్టు వద్ద అక్రమంగా గంజాయి తరలిస్తున్న కారును పోలీసులు పట్టుకున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా కారులో రెండు పెద్ద సంచులు ఉండటాన్ని గుర్తించిన పోలీసులు.. పైగా ప్రయాణికులు ఎవ్వరూ లేకపోవటంపై అనుమానంతో తనిఖీ చేశారు. కారులోని రెండు బ్యాగ్‌లలో.. 50 కిలోల గంజాయిని గుర్తించారు. గంజాయి తరలింపునకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్సై సుదర్శన్ తెలిపారు. గంజాయిని సీజ్ చేసి.. తరలింపునకు వినియోగించిన కారును స్వాధీనపరుచుకున్నారు.
ఇదీ చదవండి: