ఆంధ్రాలో మద్యం రేట్లు అధికమైన కారణంగా.. కొందరు కర్ణాటక నుంచి అక్రమంగా రాష్ట్రానికి మద్యం సరఫరా చేసి విక్రయిస్తున్నారు. కర్ణాటక సరిహద్దు వరకు మద్యం తీసుకుని వచ్చి ఏపీ సరిహద్దులో చేరవేస్తున్నారు. అనంతపురం జిల్లా విడపనకల్ మండలం వద్ద ఉన్న ఆ రాష్ట్ర సరిహద్దుల్లో ఈ చర్యలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి.
ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా అక్రమ సరఫరా జరుగుతూనే ఉన్న కారణంగా... పోలీసులు సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కర్ణాటక మద్యం, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి: