Pigs attack: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో పందుల దాడి కలకలం రేపింది. ఇందిరమ్మ కాలనీలో రాజు, నాగమణి, దివ్య అనే ముగ్గురు వ్యక్తులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. వీరిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కాలనీల్లో పారిశుద్ధ్యం లోపించిందని.. అందువల్లే పందులు స్వైరవిహారం చేస్తున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:
Bear Attack: అనంతపురం జిల్లాలో రైతుపై ఎలుగుబంటి దాడి.. తీవ్రగాయాలు