మద్యం మత్తులో నీటి గుంతలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. అనంతపురంలోని నందమూరి నగర్ చెందిన భాస్కర్ అనే వ్యక్తి ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తుండేవాడు. మద్యానికి బానిసై.. నిన్న సాయంత్రం ఇంటిలో గొడవపడి బయటికి వెళ్లినట్లు బంధువులు తెలిపారు.
కంకర క్వారీ గుంతలోని నీటిలో పడి ఈరోజు మృతి చెందినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఆత్మహత్యకు పాల్పడ్డడా అనే కోణంలో అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఇదీ చదవండి: