అనంతపురంలో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి రహదారులు, కాలనీలు జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో మురుగునీరు ఎక్కడికక్కడ పేరుకుపోయి.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానికులు ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. అడుగు వేయాలంటే బురదతో ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా యంత్రాంగం సుందర అనంత కార్యక్రమంతో నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నామని చెబుతున్నా... అది మాటలకే పరిమితమైందని పలువురు విమర్శిస్తున్నారు. ''సుందర అనంత కాస్త బురదానంత'' అయిందని స్థానికులు విమర్శిస్తున్నారు. దీనిపై జిల్లా యంత్రాంగం దృష్టి సాధించాలని కోరారు.
ఇదీ చదవండి: ఆటో మొబైల్ దుకాణంలో అగ్ని ప్రమాదం.. రూ.5 లక్షలకు పైగా నష్టం