అనంతపురం జిల్లా ధర్మవరంలో హత్యకు గురైన దళిత యువతి స్నేహలత కుటుంబానికి న్యాయం చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. వ్యవస్థల వైఫల్యమే స్నేహలత ప్రాణాలు తీసిందని ఆరోపించారు. మహిళల రక్షణ కోసం దిశ చట్టం చేశామని.. నేరం చేసినవారికి 21 రోజుల్లో శిక్ష పడుతుందంటూ ప్రచారం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆచరణలో మాత్రం ఒక్క అడుగు ముందుకు వేయలేదని పవన్ విమర్శించారు.
చిత్తశుద్ధి లేకుండా ప్రచారం కోసం చట్టాలు చేస్తే ఎంత మాత్రం ప్రయోజనం ఉండబోదని.. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ దిశ చట్టమేనని పవన్ ధ్వజమెత్తారు. బాలికలు, విద్యార్థినులు, యువతులు, మహిళలపై అఘాయిత్యాలు, దాడులపై సీఎం జగన్, హోంమంత్రి సుచరిత సమాధానం చెప్పాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: గండికోట నిర్వాసితులను క్షమాపణలు కోరిన సీఎం జగన్