ETV Bharat / state

ఆ ప్రాజెక్టుకు వైఎస్సార్ పేరు ఎలా పెడతారు: పరిటాల సునీత - పెన్నార్ ప్రాజెక్టు పేరు మార్పుపై పరిటాల సునీత వ్యాఖ్యలు

అనంతపురం జిల్లాలోని ఎగువ పెన్నార్ ప్రాజెక్టుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు ఎలా పెడతారని.. మాజీమంత్రి పరిటాల సునీత ప్రశ్నించారు. పేరూరు డ్యాంకు నీటిని తరలించే కాలువకు పరిటాల రవీంద్ర పేరు తొలగించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.

paritala sunitha
పరిటాల సునీత
author img

By

Published : Dec 10, 2020, 2:59 PM IST

అర్ధ శతాబ్దం నాటి జలాశయానికి వైఎస్.రాజశేఖర్ రెడ్డి పేరు ఎలా పెడతారని సీఎం జగన్​ను మాజీమంత్రి పరిటాల సునీత ప్రశ్నించారు. అనంతపురం జిల్లా రామగిరి మండలంలోని 56 ఏళ్లనాటి ఎగువ పెన్నార్ ప్రాజెక్టుకు తన తండ్రి రాజశేఖర్ రెడ్డి ఏమైనా పనిచేశారా అంటూ నిలదీశారు.

జీడిపల్లి జలాశయం నుంచి పేరూరు డ్యాంకు నీటిని తరలించే కాలువకు మాజీమంత్రి పరిటాల రవీంద్ర పేరును తొలింగించటంపై సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. పుట్ట కనుమ జలాశయం నిర్మాణానికి డిజైన్ చేసిన ఇంజినీర్లు ఇప్పుడు కూడా ఉన్నారని.. అప్పట్లో సర్వేచేసి నిర్ధరణ చేసిన ఇంజినీర్లు ఇప్పుడెందుకు మరోలా చెప్తున్నారో అర్థం కావడంలేదన్నారు. వారిపై రాజకీయం ఒత్తిడి ఉందని పేర్కొన్నారు. తెదేపా ప్రభుత్వంలో రాప్తాడు నియోజకవర్గంలో ప్రాజెక్టులు నిర్మిస్తుంటే భూములివ్వొద్దని వైకాపా నేతలు రైతులను రెచ్చగొట్టారని ఆమె ఆరోపించారు.

ఇవీ చదవండి..

పాఠశాలకు రాకుండా హాజరు.. ఉపాధ్యాయురాలి సస్పెండ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.