మాజీ మంత్రి, తెదేపా నేత పరిటాల సునీత చిన్న కుమారుడు సిద్దార్థ్.. శంషాబాద్ ఏసీపీ ఎదుట విచారణకు హాజరయ్యారు. రెండ్రోజుల క్రితం శంషాబాద్ విమానాశ్రయంలో బుల్లెట్‌తో సిద్దార్థ్.. ఎయిర్‌పోర్టు సిబ్బందికి చిక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్న సిబ్బంది.. సిద్ధార్థ్‌కు నోటీసులు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో ఇవాళ ఏసీపీ ఎదుట ఆయన విచారణకు హాజరయ్యారు. సిద్దార్థ్ గతంలో పాయింట్ 32 క్యాలిబర్ గన్‌కు లైసెన్స్ పొందినట్టు సమాచారం. కానీ సిద్దార్థ్ బ్యాగులో సాయుధ బలగాలు వాడే 5.56 క్యాలిబర్ బుల్లెట్ లభ్యమైనట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండి:
YS viveka murder case: 76వ రోజు విచారణ.. సమాచారమిస్తే రివార్డు ఇస్తామని సీబీఐ ప్రకటన