అనంతపురం జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో వైకాపా, తెదేపా మద్దతుదారులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. చివరిరోజైన నేడు వైకాపా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, తెదేపా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి... అభ్యర్థులతో నామినేషన్లు దాఖలు చేయించారు. 80 పంచాయతీల్లోనూ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అధికార పార్టీకి ధీటుగా ప్రతిపక్ష పార్టీ నేతలు నామినేషన్లు వేశారు.
నామినేషన్ల కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కొత్తచెరువు, నల్లమడ మండల కేంద్రాల్లో అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేయించగా.. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పుట్టపర్తి మండలంలో సర్పంచ్ నామినేషన్లు వేయించారు. అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు సాగించారు.
ఇదీ చదవండి