ETV Bharat / state

కర్ణాటకలో లోయలో పడ్డ బస్సు.. రాష్ట్ర విద్యార్థి మృతి - కర్ణాటకలో బస్సు ప్రమాదం

కర్ణాటకలో బస్సు లోయలో పడిన ఘటనలో రాష్ట్రానికి చెందిన ఓ పదో తరగతి విద్యార్థి మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు ఉపాధ్యాయులు, మరో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఘటనపై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. బాధితులకు తక్షణమే వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

bus accident
bus accident
author img

By

Published : Jan 4, 2020, 9:34 AM IST

Updated : Jan 4, 2020, 11:12 AM IST

కర్ణాటక బస్సు ప్రమాదంలో రాష్ట్ర విద్యార్థి మృతి

కర్ణాటకలోని జోగ్​ జలపాతం వద్ద బస్సు లోయలో పడిన ఘటనలో అనంతపురం జిల్లా కదిరికి చెందిన పదో తరగతి విద్యార్థి బాబా ఫక్రుద్దీన్​ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురికి గాయాలయ్యాయి. కదిరి ప్రభుత్వ వేమన ఉన్నత పాఠశాల నుంచి మూడ్రోజుల క్రితం 45 మంది విద్యార్థులు, 11 మంది ఉపాధ్యాయులు వెళ్లారు. కార్వాన్​ జిల్లాలోని జోగ్​ జలపాతం వద్ద బస్సు అదుపు తప్పి లోయలో పడింది. సమాచారం అందుకున్న కర్ణాటక పోలీసులు బాధితులను లోయలో నుంచి బయటకు తీసుకువచ్చారు. విషయాన్ని తెలుసుకున్న అనంతపురం జిల్లా కలెక్టర్​ గంధం చంద్రుడు, ఎస్పీ సత్య ఏసుబాబు బాధితులకు సహాయం అందించేందుకు జిల్లా నుంచి సిబ్బందిని పంపించారు.

సీఎం ఆరా..

బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్​ ఆరా తీశారు. గాయపడ్డవారికి తక్షణమే వైద్య సహాయం అందించాలని కలెక్టర్​ను ఆదేశించారు. విద్యార్థులు క్షేమంగా తిరిగి రావడానికి ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

ఇదీ చూడండి:

మందడంలో ఉద్రిక్తత.. పోలీసులు, గ్రామస్థుల మధ్య ఘర్షణ

Intro:Body:Conclusion:
Last Updated : Jan 4, 2020, 11:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.