.
మందడంలో ఉద్రిక్తత.. పోలీసులు, గ్రామస్థుల మధ్య ఘర్షణ - AMARAVATHI LATEST NEWS
మందడంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ధర్నా చేస్తున్న మహిళలను పోలీసులు అరెస్టు చేస్తుండగా... గ్రామస్థులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, గ్రామస్థులకు మధ్య ఘర్షణ జరిగింది. పోలీసు వాహనానికి రైతులు అడ్డుగా పడుకుని నిరసన తెలిపారు. పోలీసు వాహనం టైరు చేయిపైకి ఎక్కడం వల్ల ఓ రైతుకు గాయాలయ్యాయి. పోలీసుల తీరును నిరసిస్తూ మందడం వాసులు ఆందోళన వ్యక్తం చేశారు.
మందడంలో పరిస్థితి ఉద్రిక్తం... పోలీసులు, గ్రామస్థులకు మధ్య ఘర్షణ
.
Intro:Body:Conclusion:
Last Updated : Jan 3, 2020, 3:59 PM IST