ఏమి కష్టమెచ్చిందో ఆమెకు.. చనిపోయిన తరువాత తన మృతదేహాన్ని శ్మశానానికి తీసుకువెళ్లేందుకు ఇబ్బంది పడకూడదనుకుందో ఏమో కానీ.. ఏకంగా శ్మశానంలోనే ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఈ విచారకర సంఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగింది.
గాంధీనగర్ శ్మశానవాటికలో మహిళ ఆర్తనాదాలు విన్న స్థానికులు.. అక్కడకు వెళ్లి చూడగా 50 ఏళ్లు పైబడిన వృద్ధురాలు కాలినగాయాలతో ఉండటాన్ని గమనించారు. ఆ మహిళ తాగటానికి నీరు ఇవ్వాలని స్థానికులను చూసి సైగ చేసింది. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. సంఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలని ధర్మవరం ఆసుపత్రికి తరలించారు... బాధితురాలు చికిత్స పొందుతూ మృతి చెందింది.
ఆమె ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదనీ.. కొద్ది రోజులుగా ధర్మవరం పట్టణంలో తిరుగుతూ కడుపు నింపుకునేందుకు చిత్తుకాగితాలు సేకరించి అమ్ముకునేదని స్థానికులు వివరించారు. లాక్డౌన్ కారణంగా చిత్తుకాగితాలు కొనేవారు లేక.. కడపు నింపుకునేందుకు పట్టెడన్నం దొరక్క ఆత్మహత్యకు పాల్పడి ఉండుతుందని స్థానికులు తెలిపారు.
మృతురాలి వద్ద ఎటువంటి ఆధారాలు లభించకపోవటంతో.. ఆమె ఎవరు అనేది తెలియలేదనీ పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: