అనంతపురం నగరంలోని కంటైన్మెంట్ జోన్లలో అధికార బృందం పర్యటించింది. జిల్లా కోవిడ్ - 19 స్పెషల్ ఆఫీసర్ విజయానంద్ , అనంతపురం రేంజ్ డీఐజీ కాంతి రాణ టాటా, జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు, జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ , తదితర అధికారులు కంటైన్మెంట్ జోన్ ప్రాంతాల పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి సమీక్షించారు.
పాతవూరు గాంధీబజార్, తాడిపత్రి బస్టాండు, చెరువుకట్ట కూరగాయల మార్కెట్, మూడో రోడ్డు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. కంటైన్మెంట్ జోన్ నిబంధనలు ఎలా అమలవుతున్నాయో ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆయా ప్రాంతాల వైద్య, పారిశుద్ధ్య, పోలీసు, తదితర బృందాలతో మాట్లాడారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు. ప్రజలు విచ్చలవిడిగా తిరగకుండా, గుమిగూడకుండా అడ్డుకట్ట వేయాలన్నారు. స్వీయ జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఇవీ చదవండి: రెండు వాహనాలు ఢీ.. ఒక డ్రైవర్‌కు గాయాలు..