ETV Bharat / state

కంబోడియాలో ట్రైనింగ్ - విశాఖ కేంద్రంగా సైబర్ మోసాలు - CYBER CRIME SIX PEOPLE ARRESTED

డిజిటల్ అరెస్టు ముసుగులో అమాయకులను మోసం చేస్తున్న ముఠా గుట్టురట్టు - ఆరుగురు అరెస్టు

Cyber Crime
Cyber Crime (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 28, 2025, 6:45 PM IST

Cyber Crime Six People Arrested: కంబోడియాలో ట్రైనింగ్ తీసుకుని, విశాఖ కేంద్రంగా పని చేస్తున్న సైబర్​ నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. డిజిటల్ ముసుగులో అమాయకుల్ని మోసం చేస్తూ కోట్లు దోచుకుంటున్న ముఠా గుట్టును తిరుపతి జిల్లా పోలీసులు రట్టు చేశారు. తిరుపతిలోని సీనియర్ సిటిజన్ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు, తొలుత 10 రోజుల క్రితం రాజమండ్రికి చెందిన అరుణ్ కుమార్ అనే ముద్దాయిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్‍ రాజు తెలిపారు.

అతడిని విచారించిన తరువాత, కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు, కేసుకు సంబంధించిన ఆరుగురు ముద్దాయిలను అరెస్ట్ చేశారు. విశాఖ కేంద్రంగా సైబర్ నేరగాళ్లు ఫోన్ల ద్వారా మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‍ రాజు అన్నారు. విశాఖకు చెందిన ఆరుగురు ముద్దాయిలు ఈ సైబర్ క్రైమ్​కి పాల్పడటంతో వారిని అదుపులో తీసుకున్నామన్నారు.

అరెస్టైన వారి నుంచి 32.5 లక్షల నగదు, 141 గ్రాముల బంగారం, 8 సెల్ ఫోన్​లు, 2 ల్యాప్ టాప్​లు, ఒక సిమ్ మాడ్యులర్, 8 రూటర్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. దీంతో పాటు ఒక ముద్దాయి అకౌంట్​లోని బాధితురాలి రూ. 10 లక్షల నగదు ఫ్రీజ్ చేశామని ఎస్పీ తెలిపారు.

"బాధితులను ముందుగా ఎంచుకుని, వారిని డిజిటల్ అరెస్టు చేశామంటూ ఎక్కడకీ వెళ్లనీయకుండా భయపెడుతున్నారు. వారి దగ్గర నుంచి పెద్దమొత్తంలో డబ్బులు తీసుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం అరుణ్​ కుమార్ అనే వ్యక్తిని అరెస్టు చేశాం. అతడు ఇచ్చిన క్లూస్ ఆదారంగా మిగిలిన వారిని పట్టుకున్నాం. వారి దగ్గర నుంచి చాలా వరకూ డబ్బులు కూడా రికవరీ చేయగలిగాం. వీరందరూ కూడా కంబోడియాలో ట్రైన్ అయ్యారు. అక్కడ వారికి కొంత మొత్తంలో డబ్బులు ఇచ్చేవారు. అయితే వీరంతా ఈ క్రైమ్స్​ని సొంతంగా చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని భావించి, విశాఖ కేంద్రంగా పని చేస్తున్నారు. వీరిని అరెస్టు చేశాం. మరో ఇద్దరు ఇంకా కంబోడియాలోనే ఉన్నారు. వారిని ఇక్కడకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాం". - హర్షవర్ధన్‍ రాజు, ఎస్పీ

రాష్ట్రంలో సైబర్‌ క్రైమ్‌ పెరిగింది: డీజీపీ ద్వారకా తిరుమలరావు

సూర్యలంకలో బీచ్​ రిసార్ట్​ బుక్ చేస్తున్నారా? - తస్మాత్ జాగ్రత్త

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.