ETV Bharat / state

ప్రజా ఫిర్యాదులపై "స్పందన" కరవు

ప్రజా ఫిర్యాదులకు పరిష్కారం చూపే 'స్పందన' కార్యక్రమానికి అధికారుల నుంచి స్పందనే కరవైంది. రెవెన్యూశాఖ సేవాలోపంపై అందుతున్న ఫిర్యాదులపై ఉన్నతస్థాయి అధికారుల ఆదేశాలనూ కొందరు తహసీల్దార్లు ఖాతరు చేయడం లేదు. భూవివాదాలతో మండల కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోయిన రైతులు కలెక్టరేట్‌కు వచ్చినా పరిష్కారం కాని పరిస్థితే కనిపిస్తోంది.

స్పందన
author img

By

Published : Sep 10, 2019, 7:43 AM IST

ప్రజా ఫిర్యాదులపై "స్పందన" కరవు

సామాన్యుల సమస్యలకు సత్వర సేవలందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే కొందరు రెవెన్యూ అధికారుల తీరు మాత్రం మారటం లేదు. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి, రెవెన్యూశాఖ మంత్రి స్పందన కార్యక్రమంలో పురోగతిని సమీక్షిస్తున్నా భూవివాదాల పరిష్కారంలో కొందరు తహసీల్దార్ల తీరు మారలేదు. ప్రతినెలా ఫిర్యాదుల సంఖ్య పెరుగుతోందే తప్పా పరిష్కారం చేస్తున్న దాఖలాలు వెదికిచూసినా కనిపించని పరిస్థితి. అనంతపురంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి వచ్చిన రైతుల్లో కార్యాలయాల చుట్టూ ఎన్నో ఏళ్ల నుంచి తిరుగుతున్నవారే ఎక్కువమంది కనిపించారు.

స్పందన కార్యక్రమంలో అధికారులకు మంత్రులు ఆదేశాలు జారీ చేసినా న్యాయం జరిగిన దాఖలాలు లేవని బాధితులు ఆరోపిస్తున్నారు. రైతుల ఫిర్యాదులపై కలెక్టర్ సత్యనారాయణ ఆదేశాలనూ కొందరు తహసీల్దారులు లెక్కచేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కొన్నిచోట్ల నెలల తరబడి తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోయిన రైతులు ప్రస్తుతం కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. కలెక్టర్ సంతకంతో తిరిగి కార్యాలయానికి వస్తే తహసీల్దార్‌ ఆగ్రహావేశాలకు అంతే ఉండదని రైతులు కంటతడి పెడుతున్నారు.

భూవివాదాల పరిష్కారానికి సమయం పడుతుందని ఈ క్రమంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి శంకరనారాయణ అన్నారు. అధికారుల అలసత్వం ఉంటే విచారించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో అమాయక రైతుల భూములు ఆక్రమించటం, సరిహద్దులు చెరిపేయటం వంటి దౌర్జన్యాలు పెచ్చుమీరిపోయాయి. భూవివాదాలపై ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం అక్రమార్కులకు వరంగా మారింది.

Intro:రిపోర్టర్ : శ్రీనివాసులు
సెంటర్ : కదిరి
జిల్లా : అనంతపురం
మొబైల్ నం 7032975449
Ap_Atp_46_09_ Accident_4Injured_ AV_AP10004Body:అనంతపురం జిల్లా కదిరిపట్టణం గజ్జలరెడ్డి పల్లి వద్ద జాతీయ రహదారిపై రెండు ఆటోలు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. నల్లచెరువు వైపు నుంచి కదిరికి వస్తున్న రెండు ఆటోలు వేగనిరోధకాల వద్ద మొదటి ఆటో ఒక్కసారిగా ఆగింది. వెనుక నుంచి వచ్చిన మరో ఆటో వేగంగా ముందు వెళ్తున్న ఆటోను ఢీకొంది. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు అనంతపురం తరలించారు..Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.