అనంతపురం జిల్లా తాడిపత్రి ఏరియా ఆస్పత్రి ఆవరణలో మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి పర్యటించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండానే.. తాడిపత్రి ఏరియా ఆస్పత్రి భవనాన్ని కూల్చేశారని మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యం కోసం తాడిపత్రి ప్రజలు.. కర్నూలు, బెంగళూరు వెళ్లే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. ఏప్రిల్ 6లోపు రోగులకు నీడ కోసం షెడ్లు ఏర్పాటు చేయాలని.. లేకపోతే 7వతేదీన ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్నానికి షెడ్లు వేయడం చేతగాకపోతే తామే వేయిస్తామన్నారు.
'రోగులకు షెడ్లు ఏర్పాటు చేయాలి.. లేకుంటే ఆందోళన ఉద్ధృతం' - అనంతపురం లేటెస్ట్ అప్డేట్స్
తాడిపత్రి ఏరియా ఆస్పత్రి ఆవరణలో... ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండానే ఆస్పత్రి భవనాన్ని కూల్చేశారని మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు. ఏప్రిల్ 6లోపు రోగులకు నీడ కోసం షెడ్లు ఏర్పాటు చేయాలని... లేకపోతే 7న ప్రజలతో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.