ETV Bharat / state

కొవిడ్ కట్టడి కోసం హిందూపురంలో డ్రోన్లతో హైపోక్లోరైడ్ పిచికారీ

అనంతపురం జిల్లా హిందూపురంలో.. డ్రోన్ సాయంతో హైపోక్లోరైడ్ ద్రావణ పిచికారీని ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ప్రారంభించారు. రూ. కోటి ఎంపీ నిధులను కొవిడ్ బాధితుల చికిత్స కోసం వినియోగిస్తామని పార్లమెంట్ సభ్యులు మాధవ్ ప్రకటించారు.

drones usage for covid containment, mp gorantla madhav
కరోనా కట్టడికి డ్రోన్ల సేవలు, ఎంపీ గోరంట్ల మాధవ్
author img

By

Published : May 7, 2021, 7:10 PM IST

కరోనా కట్టడికి డ్రోన్ల సేవలు

కరోనా వైరస్ రెండో దశ తీవ్రరూపం దాల్చడంతో.. అనంతపురం జిల్లా హిందూపురంలో కట్టడి చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. డ్రోన్ సాయంతో హైపోక్లోరైడ్ ద్రావకాన్ని పట్టణమంతా పిచికారీ చేయించారు. ఈ యంత్రాన్ని బెంగళూరు నుంచి ప్రత్యేకంగా తెప్పించినట్లు ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ తెలిపారు.

ఇదీ చదవండి: కరోనాపై అఖిలపక్ష భేటీకి సోనియా డిమాండ్​

పట్టణంలోని సద్భావం కూడలి వద్ద ఈ కార్యక్రమాన్ని.. ఎంపీ, ఎమ్మెల్సీ లాంఛనంగా ప్రారంభించారు. డ్రోన్ ద్వారా పట్టణమంతా హైపోక్లోరైడ్ పిచికారీ చేయనున్నట్లు తెలిపారు. దాదాపు రూ. కోటి ఎంపీ నిధులను తెచ్చి.. హిందూపురం పార్లమెంట్ పరిధిలోని కొవిడ్ బాధితుల చికిత్సకు ఖర్చు చేస్తామని గోరంట్ల మాధవ్ వెల్లడించారు.

ఇదీ చదవండి:

ఒకే మంచంపై మృతదేహం, బాధితుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.