సత్యసాయి కొవిడ్ ఆస్పత్రిలో రోగులకు.. వైద్యులు అందిస్తున్న వైద్య సేవలు అమోఘమని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అభినందించారు. పుట్టపర్తిలోని సత్యసాయి కొవిడ్ ఆస్పత్రిని ఆయన వైద్య బృందంతో కలిసి పరిశీలించారు. కొవిడ్ రోగులకు మానసిక ఉల్లాసం కలిగించేలా.. ఆహ్లాదం కలిగిస్తూ వైద్య సేవలు అందించాలని ఆయన వైద్య బృందాన్ని కోరారు. ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలు ఆక్సిజన్ సరఫరా తదితర అంశాలపై ఆస్పత్రి డైరెక్టర్ గురుమూర్తి, డాక్టర్ దినకర్లతో ఆయన చర్చించారు.
ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని.. ఆక్సిజన్ కొరత రాకుండా అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. మంచి రుచికరమైన భోజనంతో పాటు మానసిక ఉల్లాసం కలిగించేందుకు క్రీడా విన్యాసాలు నిర్వహించాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించి మాస్కులు ధరించాలని ఆయన కోరారు అవసరం ఉంటేనే బయటికి రావాలని ప్రతి ఒక్కరి ఇంటికే పరిమితం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇవీ చూడండి.. కొవిడ్ ఎఫెక్ట్: కూరగాయల మార్కెట్ వేరే ప్రాంతానికి తరలింపు