ETV Bharat / state

'వైకాపాలో బెంజ్, పేకాట మంత్రులు తయారయ్యారు' - super spinning mill workers protest latest news

అనంతపురం జిల్లా కిరికెరలో ఉన్న సూపర్ స్పిన్నింగ్ మిల్లు కార్మికులు చేస్తున్న నిరసన దీక్షలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొని మద్దతు ప్రకటించారు. కార్మికులకు న్యాయబద్ధంగా లే ఆఫ్ ప్రకటించాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రులు వారికి కేటాయించిన శాఖలపై అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. వైకాపా ప్రభుత్వంలో బెంజ్ మంత్రులు, పేకాట మంత్రులు తయారయ్యారని ఎద్దేవా చేశారు.

MLA Nandamuri Balakrishna
సూపర్ స్పిన్నింగ్ మిల్లు కార్మికుల నిరసన దీక్షలో ఎమ్మెల్యే బాలకృష్ణ
author img

By

Published : Jan 6, 2021, 3:45 PM IST

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిరసన బాట పట్టారు. అనంతపురం జిల్లా కిరికెరలో ఉన్న సూపర్ స్పిన్నింగ్ మిల్లు నష్టాల బాట పట్టడంతో లే ఆఫ్ ప్రకటించారు. న్యాయబద్ధంగా లే ఆఫ్ ప్రకటించాలంటూ డిమాండ్ చేస్తూ కార్మికులు చేస్తున్న నిరసన దీక్షలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొని మద్దతు ప్రకటించారు. ప్రభుత్వానికి, జగన్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మిల్లుకు సంబంధించిన భూములు, ఆస్తుల్లో వైకాపా నాయకులు అక్రమంగా లే అవుట్లు వేస్తున్నారని ఆరోపించారు. కార్మికులకు అన్యాయం చేస్తున్నారని, వారి న్యాయపోరాటానికి తెదేపా పూర్తి మద్దతుగా ఉంటుందని తెలిపారు. కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు వారివెంట నడుస్తానని భరోసా ఇచ్చారు. వైకాపా ప్రభుత్వంలో బెంజ్ మంత్రులు, పేకాట మంత్రులు తయారయ్యారని ఎద్దేవా చేశారు.

ఇవీ చూడండి...

బుల్లెట్​ నడుపుతూ..కార్యకర్తల్లో ఉత్సాహం నింపిన బాలయ్య

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.