హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. తన నియోజకవర్గ పర్యటనలో భాగంగా తెదేపా నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో స్థానిక ఎన్నికల్లో తమ పార్టీ మద్దతుదారులను గెలిపించుకునేలా కార్యకర్తలు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం పట్టణానికి చెందిన పలువురు యువత బాలకృష్ణ సమక్షంలో పార్టీలో చేరారు . యువకులకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు బాలకృష్ణ. పార్టీ గెలుపు కోసం అందరూ కృషి చేయాలని తెలిపారు. యువత రాజకీయాల్లోకి రావటం శుభపరిణామమని ఆయన అన్నారు.
ఇదీ చదవండీ.. పల్లా దీక్షను భగ్నం చేయడం దారుణం: లోకేశ్