తమ భూములు బలవంతంగా లాక్కునేందుకు కొందరు యత్నిస్తున్నారని అనంతపురం జిల్లా ఓబులదేవరచెరువు మండలంలో కొందరు వ్యక్తులు ఆందోళనకు దిగారు. భూములు రిజిస్ట్రేషన్ కాకుండా అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అనుచరులు ఇదంతా చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. గతేడాది తాము కొందరు వ్యక్తుల నుంచి భూములు కొనుగోలు చేశామని... అయితే దీనికి అగ్రిమెంట్ మాత్రమే జరిగిందని తెలిపారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకునే ప్రయత్నం చేస్తే.. ఎమ్మెల్యే అనుచరులు దానిని రికార్డులో రెడ్మార్క్లో పెట్టారని ఆరోపిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే తమ భూములు ఇచ్చేయాలని బెదిరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. లేకపోతే భూములను గార్మెంట్స్ పరిశ్రమకు ఇస్తామంటూ భయపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి