అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. తెదేపా నాయకుడు కుమార్తె వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అంతకుముందు ముస్లీం సోదరులతో కలిసి మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం హిందూపురం తెదేపా నాయకుడు ప్యారు సాబ్ కుమార్తె వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్యారు సాబ్ కుటుంబీకులు బాలకృష్ణకు భారీ గజమాలను క్రేన్ సహాయంతో బహూకరించి అభిమానాన్ని చాటుకున్నారు.
ఇదీ చదవండి : హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని హైకోర్టులో పిల్