అనంతపురం జిల్లా పెనుకొండ మండలం గుట్టూరు చెరువుకు బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎం.శంకర్ నారాయణ జలహారతి ఇచ్చారు. సెప్టెంబరు 11న మంత్రి చేతుల మీదుగా గొల్లపల్లి జలాశయం నుంచి హంద్రీనీవా కాలువ ద్వారా గుట్టూరు చెరువుకు కృష్ణాజలాలు విడుదల చేశారు. దీనితో చెరువు నిండి జలకళను సంతరించుకుంది. ఈ సందర్భంగా రైతులు మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. జలహారతి కార్యక్రమంలో పట్టణ సబ్ కలెక్టర్ నిశాంతితో పాటు జలవనరులశాఖ డీఈ గోపీ తదితరులు పాల్గొన్నారు.
ఇదీచదవండి