ETV Bharat / state

పాత క్వారీలు.. కొత్త దారులు..! - అనంతపురం తాజా వార్తలు

అనంతపురం జిల్లాలో నేమకల్లు క్వారీల్లో అక్రమాలు మితిమీరిపోతున్నాయి. ఇక్కడ గతంలో అవినీతి, అక్రమాలు బయటపడిన కారణంగా.. అధికారులు పెద్దఎత్తున జరిమానాలు విధించారు. తర్వాత స్థానికుల ఫిర్యాదుతో నిషేధాజ్ఞాలు సైతం అమలు చేశారు. అయినా.. ఎలాంటి మార్పు కనిపించడం లేదు.

quary
quary
author img

By

Published : Apr 24, 2021, 3:30 PM IST

జిల్లా కేంద్రానికి దూరంగా ఉండటం, గనుల శాఖ అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తుండటం, కొండంత అండగా ‘అధికారం’.. వెరసి అనంతపురంలోని నేమకల్లు క్వారీల్లో అక్రమాలు మితిమీరిపోతున్నాయి. ఇక్కడ గతంలో అవినీతి, అక్రమాలు బయటపడటంతో అధికారులు పెద్దఎత్తున జరిమానాలు విధించారు. తర్వాత స్థానికుల ఫిర్యాదుతో నిషేధాజ్ఞాలు కూడా అమలు చేశారు. అయినా ఎలాంటి మార్పు కనిపించడం లేదు. కంకర క్వారీలో అక్రమ తవ్వకాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇక్కడి క్వారీల్లో ఖనిజ తవ్వకాలు, రవాణాను జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) నిషేధించింది.

అయితే.. జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి తన పలుకుబడి ఉపయోగించి అనుమతులు తెచ్చుకున్నారు. గతంలో ఇదే క్వారీని సదరు ప్రజాప్రతినిధి లీజుకు తీసుకుని నడిపించారు. నిబంధనలు పాటించడం లేదనే కారణంతో రూ.1.90 కోట్ల మేర జరిమానా విధించారు. తర్వాత ఆ క్వారీని ఆ ప్రజాప్రతినిధి గనుల శాఖకు సరెండర్‌ చేశారు. తిరిగి కుటుంబ సభ్యుల పేరుమీద లీజు అనుమతులు తెచ్చుకుని తవ్వకాలు ప్రారంభించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ పెద్ద ఎత్తున ఖనిజాన్ని తరలిస్తున్నారు. అక్కడ తవ్విన కంకర రాళ్లను నేమకల్లు పరిసర ప్రాంతాల్లోని 15 క్రషర్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

ఆ రెండింటికే అనుమతి

నేమకల్లు పరిసర ప్రాంతాల్లో కాలుష్యం అధికం కావడంతో స్థానికులు 2017లో ఎన్జీటీని ఆశ్రయించారు. సమగ్ర విచారణ చేపట్టిన ఎన్జీటీ అధికారులు నేమకల్లు కొండల్లోని 19 కంకర క్వారీలపై నిషేధం విధించారు. ఎలాంటి పేలుళ్లు, తవ్వకాలు, రవాణా చేపట్టకూడదని ఆదేశించారు. దీనిపై క్వారీ యజమానులు ఎన్జీటీని సంప్రదించి, తమకు న్యాయం చేయాలని గతేడాది కోరగా.. నేమకల్లులో క్రషర్లకు మాత్రమే అనుమతి లభించింది.

తవ్వకాలు చేపట్టరాదని స్పష్టం చేసింది. జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి గత జనవరి, మార్చి నెలల్లో కొత్త క్వారీలకు అనుమతులు తెచ్చుకున్నారు. పర్యావరణ శాఖ సైతం అనుమతులు ఇచ్చింది. ఇక్కడ విశేషమేమంటే లీజులు కొత్తవే అయినప్పటికీ తవ్వే ప్రాంతం మాత్రం పాతదే. గతంలో సదరు ప్రజాప్రతినిధి సరెండర్‌ చేసిన క్వారీల్లోనే తవ్వకాలు జరుగుతున్నాయి. నేమకల్లులో 19 క్వారీలుండగా, రెండింటిలో మాత్రమే తవ్వుకోవడానికి గనులు, భూగర్భశాఖ అనుమతులు జారీ చేయడం విమర్శలకు దారితీస్తోంది.

నిబంధనల ఉల్లంఘన

ఈ వ్యవహారంలో కొత్త లీజు నామమాత్ర ప్రక్రియగా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కంకర తవ్వకాలు జరుగుతున్నాయి. అనుమతులు లేకుండా కంకరను అక్రమంగా క్రషర్‌ యూనిట్లకు తరలిస్తున్నారు. ఇటీవల తెచ్చుకున్న లీజు ప్రాంతాల్లో కాకుండా.. పాత క్వారీల్లో తవ్వకాలు పెద్దఎత్తున చేపడుతుండటం గమనార్హం. ఇది గనుల నిబంధనలు ఉల్లంఘించడమే. డిటోనేటర్లు, స్లర్రీలతో బ్లాస్టింగ్‌ చేపడుతున్నారు. క్వారీల్లో హద్దులు దాటి తవ్వకాలు జరుపుతున్నారు. తవ్విన ఖనిజాన్ని బయట ప్రాంతాలకు రవాణా చేస్తే.. బరువుకు తగ్గట్టు ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాల్సి ఉంది. మూడు నెలలుగా తవ్వకాలు జరుగుతున్నా వేయింగ్‌ యంత్రాన్ని కూడా ఏర్పాటు చేయలేదు.

ఒకే సర్వే నెంబరుతో..

నేమకల్లు వద్ద క్వారీలన్నీ 253 సర్వే నెంబరులో ఉన్నాయి. లీజు అనుమతులు ఆ నెంబరుపైనే ఇస్తున్నారు. దీంతో లీజుదారులు తమకు ఇష్టమొచ్చిన ప్రాంతాల్లో తవ్వకాలు చేపడుతున్నారు. గనుల శాఖ అధికారులు అనుమతించిన రెండు క్వారీలకు అదే సర్వే నెంబరు ఉండటంతో ఏది సక్రమమో.. ఏది అక్రమమో తెలియని పరిస్థితి. గతంలో అక్రమాలు వెలుగులోకి రాగా.. క్వారీలపై అధికారులు విచారణ చేపట్టి పెద్దఎత్తున జరిమానాలు విధించారు. లీజుదారులు అప్పీలుకు వెళ్లి.. జరిమానా తగ్గించుకుంటున్నారు. తిరిగి అక్రమాలకు తెరలేపుతున్నారు.

చోద్యం చూస్తున్న యంత్రాంగం

నేమకల్లులో క్రషర్ల నిర్వహణకు మాత్రమే ఎన్జీటీ అవకాశం ఇచ్చింది. గనుల శాఖ అధికారులు ఏకంగా రెండు క్వారీలకు కొత్తగా అనుమతులు మంజూరు చేశారు. అలాగే పర్యావరణ శాఖ కూడా అనుమతి ఇచ్చింది. క్వారీల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ పెద్దల అండదండలు ఉండటంతోనే పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. స్థానికుల నుంచి ఫిర్యాదులు అందినా స్పందించక పోవడం గమనార్హం.

ఆదాయానికి గండి

తవ్వితీసిన ఖనిజానికి లీజుదారుడు సీనరేజి చెల్లించాలి. ఇక్కడ అవేమీ కానరావడం లేదు. పదుల సంఖ్యలో టిప్పర్లు రేయింబవళ్లు ఖనిజాన్ని క్రషర్‌ యూనిట్లకు రవాణా చేస్తున్నాయి. రోజుకు సుమారు 200 టిప్పర్లలో రాళ్లను తరలిస్తున్నారు. బయటి క్రషర్లకు టన్ను రూ.250 ప్రకారం విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఈ లెక్కన రూ.లక్షల్లో ఆర్జిస్తున్నారు. మరోవైపు రాయల్టీ చెల్లించకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.

మా దృష్టికి రాలేదు

నేమకల్లులో కొత్తగా రెండు క్వారీలకు అనుమతులు ఇచ్చాం. వాటిలో అక్రమాలు జరుగుతున్నట్లు మా దృష్టికి రాలేదు. త్వరలోనే విచారణ చేయిస్తాం. అక్రమాలు ఉన్నాయని తేలితే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటాం. - బాలాజీనాయక్, ఏడీ, గనుల శాఖ

ఇదీ చదవండి:

సంగం డెయిరీ కార్యాలయంలో ఏసీబీ అధికారుల తనిఖీలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.