అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం ముప్పలకుంట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి.. కరోనా మృతుని అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. కొద్దిరోజుల అనంతరం గ్రామస్థులు... బాధితుడిలో అవహేళనగా మాట్లాడారు. తనకు కరోనా రాకున్నా గ్రామస్థులు అవమానించడాన్ని తట్టుకోలేక పురుగుల మందు తాగాడు.
గమనించిన కుటుంబీకులు బాధితుడిని కళ్యాణదుర్గం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచదవండి.