ETV Bharat / state

మల్కాజ్​గిరి ఏసీపీకి.. అనంతపురం జిల్లాలోనూ ఆస్తులు! - hyderabad news

అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్​లోని మల్కాజ్​గిరి ఏసీపీ నర్సింహారెడ్డిని అరెస్టు చేసిన అధికారులు... ఇవాళ అనిశా కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. నర్సింహారెడ్డి స్వగ్రామమైన అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం పూల ఓబయ్యపల్లిలో అధికారులు విచారణ జరిపి.. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

malkajgiri-acp-narsimha-reddy-arrested-by-acb
ఏసీపీ నర్సింహారెడ్డిని అనిశా కోర్టులో ప్రవేశపెట్టనున్న అధికారులు
author img

By

Published : Sep 24, 2020, 11:51 AM IST

అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నహైదరాబాద్​లోని మల్కాజ్​గిరి ఏసీపీ నర్సింహారెడ్డిని అరెస్టు చేసిన అధికారులు... ఇవాళ అనిశా కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. నర్సింహారెడ్డికి సంబంధించిన ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాంకు లాకర్లను అనిశా అధికారులు తెరవనున్నారు. అతని అక్రమాస్తులపై ఆయన స్వగ్రామమైన అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం పూల ఓబయ్యపల్లిలో విచారణ జరిపారు. వ్యవసాయ భూములు, ఇతర ఆస్తులకు సంబంధించిన పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న పక్కా సమాచారంతో హైదరాబాద్​తో పాటు వరంగల్, జనగాం కరీంనగర్, నల్గొండ, రాష్ట్రంలోని అనంతపురంలో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహించారు. నర్సింహారెడ్డి గతంలో ఉప్పల్‌, మియాపూర్​లో సీఐగా పనిచేశారు. పలు భూవివాదాల్లో తలదూర్చి రాజీ చేసినట్టు నర్సింహారెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఏసీపీ నర్సింహారెడ్డిపై వచ్చిన ఫిర్యాదులు, ఆరోపణలపై నిఘా పెట్టిన అనిశా అధికారుల దాడులు నిర్వహించారు. సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్​లోని అతని నివాసంతో పాటు అతని స్నేహితులు, బంధువులు, బినామీల ఇళ్లలో బుధవారం ఉదయం నుంచి సోదాలు నిర్వహించారు. ఇప్పటి వరకూ రూ.70కోట్ల అక్రమాస్తులు కూడబెట్టినట్లు తేలింది.

ఆంధ్రాలోనూ ఆస్తులు

అనంతపురంలో 55 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించిన అధికారులు.... హైదరాబాద్​లోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన హైటెక్ సైబర్ టవర్స్ వద్ద 1960 గజాలు గల 4 ఇళ్ల స్థలాలు, మరో 2 ఇళ్ల స్థలాలు, హఫీజ్ పేటలో 3 అంతస్థుల వ్యాపార సముదాయం, నగరంలో 2 ఇళ్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో పాటు ఇంట్లో రూ. 15లక్షల నగదు, 2 బ్యాంక్ లాకర్లతో పాటు స్థిరాస్తి వ్యాపారం, ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినట్లు అనిశా గుర్తించింది. దీంతో పాటుగా యాదాద్రిలోని అతని బినామీ ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు.

ఇదీ చూడండి:

ఎస్సై పేరుతో ఫేస్​బుక్ ఖాతా... అప్రమత్తంగా లేకుంటే బుక్కైపోతారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.