అనంతపురం జిల్లాలో మూడో దశ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా ఇచ్చిన హామీలను.. నెరవేర్చిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుందని అనంతపురం అర్భన్ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.
అనంతపురం రూరల్ పరిధిలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఆయన ఓటర్లను ఉద్ధేశించి మాట్లాడారు. శివారు ఎన్టీఆర్ కాలన, లేనిల్ నగర్లో ఇంటింటికి వైకాపా పార్టీ శ్రేణులతో కలిసి ప్రచారం చేశారు. వైకాపా బలపర్చిన అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని ఓటర్లకు వివరించారు. ఎన్నికల్లో వైకాపా బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు.