ETV Bharat / state

రాష్ట్రంలోనే విద్యుత్ బస్సులు:బుగ్గన - electric busses

అనంతపురం జిల్లా పెనుకొండలో తయారైన కియా మోటార్స్ తొలి నూతన కారు మార్కెట్ లోకి విడుదల చేశారు. ఈనెల 22 నుంచి కియా కార్లను వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. విద్యుత్​తో నడిచే బస్సులను తయారు చేసే పరిశ్రమలను మన రాష్ట్రంలోనే ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి బుగ్గన తెలిపారు.

విద్యుత్ బస్సులూ తయారయ్యేలా ప్రణాళికలు
author img

By

Published : Aug 9, 2019, 6:07 AM IST

Updated : Aug 9, 2019, 6:15 AM IST

కరవు జిల్లా అనంతపురం పెనుకొండలో తయారైన కియా మోటార్స్ తొలి కారును... రాష్ట్ర మంత్రులు మార్కెట్ లోకి విడుదల చేశారు. సెల్టోస్ కారు కోసం మొదటి రోజే 6000 బుకింగ్ లు రావటం అభినందనీయమన్నారు
పర్యవరణ పరిరక్షణే ధ్యేయంగా....
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా విద్యుత్ తో నడిచే ఆర్టీసీ బస్సులు మన రాష్ట్రంలోనే తయారయ్యే విధంగా పరిశ్రమల్ని తీసుకురానున్నామని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని రకాల వసతులను కల్పించనున్నట్లు పేర్కొన్నారు. పెట్టుబడులకు ఒక అథారిటీ ఏర్పాటు చేసి దేశ విదేశాల నుంచి వచ్చే వారిని స్వాగతిస్తామన్నారు.

విద్యుత్ బస్సులూ తయారయ్యేలా ప్రణాళికలు
ఇవీ చూడండి-కియా కారు విడుదలపై చంద్రబాబు హర్షం

Intro:పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం సాధారణ భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు అతి తక్కువ సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

Body:ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రతి శనివారం వేలాది సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. అయితే ఈ శనివారం భక్తుల సంఖ్య తగ్గిపోయింది. అంతంతమాత్రంగానే భక్తులు స్వామివారి క్షేత్రానికి చేరుకున్నారు .దీంతో ఆలయ పరిసరాలు, శ్రీవారి దర్శనం క్యూ కాంప్లెక్స్ కంపార్టుమెంట్లు, ప్రసాదాల కౌంటర్ , కేశఖండన శాల ,అన్నదానం అతి తక్కువ భక్తులతో దర్శన మిచ్చాయి. భక్తులు అతి తక్కువ సమయంలోనే దర్శనం, మొక్కుబడులు తీర్చుకున్నారు. భక్తులు అతి తక్కువ సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అయితే ఈ వారు అమావాస్య రావడంతో భక్తుల సంఖ్య తగ్గిందని వారు పేర్కొన్నారు.

Conclusion:భక్తులు ఎటువంటి అసౌకర్యానికి గురవకుండా స్వామివారి దర్శనం చేసుకున్నారు.
Last Updated : Aug 9, 2019, 6:15 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.