ETV Bharat / state

కియా రాకతో మారిన రూపురేఖలు.. యువత, మహిళలకు ఉపాధి - హిందూపురం

తెల్లవారి కోడికూతతో నాగలి భుజాన వేసుకుని రైతులు పొలంబాట పట్టే ఆ ప్రాంతంలో నేడు సాధారణ ప్రజల జీవనశైలి పూర్తిగా మారిపోయింది. వేకువజామునే లేచి హడావుడిగా సమీప పరిశ్రమల్లో పనులకు వెళ్తున్నారిప్పుడు. ఎందుకూ కొరగాని కొండగుట్టల్లో ఎంతో విలాసవంతమైన భవంతుల్లో నివసిస్తున్నారు. పారిశ్రామికాభివృద్ధిలో ఆ ప్రాంతం దూసుకుపోతుంది. ఆ స్థాయిలో అక్కడ మార్పులు రావడానికి కారణం ఏంటి? ఆ ప్రాంతం ఎక్కడ ఉంది తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయాల్సిందే!

kia motors changed the life of penukonda people
కియా కార్ల పరిశ్రమ
author img

By

Published : Jan 10, 2021, 5:11 PM IST

తెల్లవారి కోడికూతతో నాగలి భుజాన వేసుకుని రైతులు పొలంబాట పట్టే పెనుకొండ ప్రాంతంలో నేడు సాధారణ ప్రజల జీవనశైలి పూర్తిగా మారిపోయింది. వేకువజామున లేచి హడావుడిగా సమీప పరిశ్రమల్లో పనులకు వెళ్లడానికి సిద్ధం అవుతున్నారు. కియా కార్ల పరిశ్రమ రాకతో పెనుకొండ ప్రాంత రూపురేఖలే మారిపోయాయి.. పదుల సంఖ్యలో అనుబంధ పరిశ్రమల ఏర్పాటుతో వేలాది మంది జీవనశైలిలో మార్పు వచ్చింది. నేల ధర నింగినంటింది. గుట్టలు కనుమరుగయ్యాయి. చెరువులు ప్లాట్లయ్యాయి. చిన్న ఇళ్లు మేడలయ్యాయి. మేడలు బహుళ అంతస్తుల భవంతులయ్యాయి. చిన్న అంగళ్లు సూపర్‌ మార్కెట్లయ్యాయి. రాత్రుళ్లు విద్యుత్తు వెలుగులు ధగధగలాడుతున్నాయి. చీకటి పడితే జనసంచారం కానరాని ప్రాంతం తెల్లవార్లూ సందడి సంతరించుకుంది. పల్లెల నుంచి కుటుంబాలు మండల కేంద్రాలకు మకాం మారుస్తున్నాయి. ఈ ఏడాది ఆఖరుకల్లా వీరా బస్సుల తయారీ పరిశ్రమ ఏర్పాటైతే ఈ ప్రాంత ముఖచిత్రమే అనూహ్యంగా మారిపోనుంది.

వెలిసిన విలాసవంత భవనాలు..

పారిశ్రామికాభివృద్ధిలో ఈ ప్రాంతం దూసుకుపోతున్న నేపథ్యంలో ఎందుకూ కొరగాని కొండగుట్టల్లో ఎంతో విలాసవంతమైన భవంతులు కనిపిస్తున్నాయి. పెద్ద పట్టణ, నగర వాతావరణాన్ని తలపించే పరిస్థితి. జాతీయ రహదారికి ఆనుకుని గోరంట్ల మండల పరిధిలో ఎక్కడ చూసినా భవంతులు, హోటళ్లు కనిపిస్తున్నాయి. మార్కెట్‌లోకి విడుదలైన వెంటనే కొత్త వాహనాలు, వాహన షోరూమ్‌లు, వాణిజ్య బ్యాంకులు, ఎన్నో రకాల దుకాణాలు దర్శనమిస్తున్నాయి.

కోడూరు, గుంతపల్లి సమీపాల్లో ఏర్పాటైన రెండు దుస్తుల పరిశ్రమల్లో సుమారు వెయ్యిమంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఈ ప్రాంతంలోని ప్రతి గ్రామం నుంచి ఆటోల్లో మహిళలు పరిశ్రమల వద్దకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో చాలా కుటుంబాలు మండల కేంద్రాలకు చేరుతున్నాయి. గోరంట్లలోనే వెయ్యిమందికి పైగా స్థానిక, స్థానికేతరులు కియా కంపెనీల్లో పనుల కోసం వెళ్తున్న వారున్నారు. పది సూపర్‌ మార్కెట్లు ఏర్పాటయ్యాయి. అయిదు వాహన షోరూంలున్నాయి. అడుగుకో చరవాణి దుకాణం. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వ్యాపారం ఏర్పాటుచేసే దిశగా ఆలోచిస్తున్నారు. వాహన మెకానిక్‌ దుకాణాలు పదుల సంఖ్యలో పెరిగాయి.

నగరంలో పని చేసినట్లుంది..

మాది అనంతపురం, బీటెక్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేశాను. కియా కార్ల పరిశ్రమలో ఉద్యోగం వచ్చింది. గోరంట్లలో ఉంటున్నా. పెద్ద నగరంలో పని చేసిట్లుగానే ఉంది. షిప్టు ప్రకారం కంపెనీ వాహనం వస్తుంది. విధులకు హాజరవడం, అయిపోగానే అదే వాహనంలో ఇంటికి చేరుకోవడం. మంచి వేతనం ఇస్తున్నారు. స్థానికంగా ఇలాంటి ఉద్యోగం దొరకడం అదృష్టంగా భావిస్తున్నా.

- ధనుష్‌, అనంతపురం

సూపర్‌ మార్కెట్లు..

మొన్నటి వరకు నగరాలు, పట్టణాలకే పరిమితమైన సూపర్‌ మార్కెట్లు నేడు మండల కేంద్రాల్లో పదుల సంఖ్యలో వెలిశాయి. ఆఖరుకు గోరంట్ల మండలంలోని చిన్నగ్రామం పాలసముద్రంలోనూ అత్యాధునిక దుకాణం వెలిసింది. అంతేకాదు ప్రతి ఒక్కరి మదిలో వ్యాపార ఆలోచనలు తొలుస్తున్నాయి. ఇల్లు కట్టాలనుకునే వారు అదే స్థలంలో రెండు లేదా మూడు అంతస్తుల భవనాలు నిర్మించి అద్దె రూపంలో ఆదాయ వనరు పెంచుకొనే దిశగా అడుగులేస్తున్నారు. ఎకరా పొలం రూ.కోట్లలో ధర పలుకుతోంది. చిన్న రైతులు కార్లు, ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగాలు చేస్తున్న వారు గోరంట్ల, సోమందేపల్లి, పెనుకొండతోపాటు కర్ణాటకలోని బాగేపల్లి, హిందూపురం, ధర్మవరం, పుట్టపర్తి, సీకేపల్లి తదితర మండలాల్లో నివాసం ఉంటున్నారు. కంపెనీలు ఏర్పాటు చేసిన బస్సుల్లో నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు.

kia motors changed the life of penukonda people
కియా కార్ల పరిశ్రమ

యువతకు ఉపాధి

పెనుకొండ సమీపంలో కియా కార్ల పరిశ్రమ, వాటికి అనుబంధంగా సోమందేపల్లి, గోరంట్ల మండలాల్లో 15కు పైగా చిన్న పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఆయా మండలాల్లోని అన్ని పల్లెల యువత పరిశ్రమల్లో పనిచేయడానికి వెళ్తున్నారు. కొందరు రోజువారీ కూలి, మరికొందరు నెలవారీ వేతనం పొందుతున్నారు. మరోవైపు రాకపోకలు పెరిగాయి. అన్ని మార్గాల్లో రద్దీ ఏర్పడింది. ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు అన్ని వైపుల నుంచి వచ్చే రహదారుల కూడళ్లు వాహనాలతో కిటకిటలాడుతున్నాయి.

వేలమందికి ఉపాధి..

బీఈడీ చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో కియా అనుబంధ సంస్థలో అవకాశం వచ్చింది. నెలకు రూ.10 వేలు ఇస్తున్నారు. సొంతూరిలోనే ఉద్యోగం లభించడం ఆనందంగా ఉంది. పరిశ్రమల రాకతో సోమందేపల్లి, గోరంట్ల, పెనుకొండ ప్రాంతాల్లో వేలమందికి ఉపాధి లభిస్తోంది.

- పర్వీన్‌బాను, సోమందేపల్లి

ఇద్దరు పిల్లల్ని చదివిస్తున్నా..

ఇన్నాళ్లు ఇంటికే పరిమితమయ్యా. మా ప్రాంతంలో పరిశ్రమలు, గార్మెంట్‌ కంపెనీ పెట్టారు. పీఎంకేవీవై ఆధ్వర్యంలో శిక్షణ పొంది గుంతపల్లి వద్ద గార్మెంట్స్‌ పరిశ్రమకు వెళుతున్నా. నెలకు రూ.7,000 చేతికి వస్తోంది. ఏ సమస్య లేకుండా కుటుంబ అవసరాలు తీరుతున్నాయి. ఇద్దరు పిల్లలను చదివిస్తున్నా.

- ధనలక్ష్మి, గోరంట్ల

పెనుకొండలో దుకాణాల వివరాలు..

సాధారణ దుకాణాలు: 50

హోటళ్లు: 100 పైగా

సూపర్‌ మార్కెట్లు: 20 (స్థానికులు, తమిళులు)

ఫోన్‌ అమ్మకాలు, మరమ్మతు దుకాణాలు: 70 వరకు

గృహ నిర్మాణ సామగ్రి: 25 (యూపీ, రాజస్థాన్‌)

బేకరీలు: 10 (కన్నడిగులు)

ద్విచక్రవాహన మరమ్మతు దుకాణాలు: 30

బ్యాంకులు: 6

ఉపాధి: 10 వేల మందికి

వలస వచ్చిన కుటుంబాలు: 1,500

ఇదీ చదవండి: ఏళ్లు గడిచినా దక్కని ఉపాధి... ప్రకటనలతోనే సరి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.