అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఓ వ్యక్తి నుంచి కర్ణాటక మద్యం ప్యాకెట్లను గుడిబండ మండల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మండలం కేంద్రంలో కర్ణాటకకు చెందిన కృష్ణమూర్తి అనే వ్యక్తి వద్ద ఉన్న 389 మద్యం ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. అనంతరం అతణ్ని అరెస్ట్ చేసి రింమాండ్కు తరలించారు. మండలంలో ఎవరైనా అక్రమంగా మద్యం అమ్మినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై సుధాకర్ యాదవ్ హెచ్చరించారు.
ఇదీ చదవండి: