ధర్మవరం పట్టణంలోని వైఎస్ఆర్ కాలనీ వద్ద పోలీసుల తనిఖీల్లో కర్ణాటక మద్యం పట్టుబడింది. ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 579 కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు, 50 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ కరుణాకర్ వెల్లడించారు. వీటి విలువ రూ. 1.60 లక్షలు ఉంటుందన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి.. వాహనాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి :