అనంతపురం జిల్లా శ్రీ కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారు సింహవాహనంపై విహరించారు. శ్రీదేవి భూదేవి సమేత నరసింహుడి ఉత్సవమూర్తులను అలంకార మండపానికి తీసుకొచ్చిన అర్చకులు.. వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ప్రత్యేక పల్లకిలో స్వామి వారిని ఊరేగింపుగా రాజగోపురం ముందుకు తీసుకొచ్చారు. వీధుల్లో విహరింపజేశారు. స్వామి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
ఇవీ చదవండి: