అనంతపురం జిల్లా కదిరిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రజా గరుడ సేవ నేత్రపర్వంగా సాగింది. పదో రోజు నారసింహుడు గరుడ వాహనంపై విహరించారు. ఆళ్వారుల చేత ప్రజలు నిర్వహించే ఈ ఉత్సవాన్ని ప్రజా గరుడ సేవగా పిలుస్తారు. శోభాయమానంగా అలంకరించిన ఉత్సవమూర్తులను అర్చకులు ప్రత్యేక పల్లకిలో కొలువు తీర్చి రాజగోపురం ముందుకు తీసుకొచ్చారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం స్వామి వారు గరుత్మంతుడు వాహనంపై మాఢవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వేడుకలో చెక్కభజన, కోలాటం, భజన మండలి సభ్యుల ప్రదర్శనలు ఆకర్షణగా నిలిచాయి.
ఇదీ చదవండి : కరోనా నుంచి పిల్లల్ని ఇలా.. రక్షించుకుందాం!