నీటి సమావేశాల కన్నా ముందు రాయలసీమలోని కార్యకర్తలను కాపాడండి అంటూ తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తెదేపా నేతలపై ఫైర్ అయ్యారు. అనంతపురంలో నిర్వహించిన సీమ స్థాయి తెదేపా నేతల సదస్సులో జేసీ మాట్లాడారు. కార్యకర్తలను జైళ్లకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముందుగా జిల్లాలోని తెదేపా శ్రేణులను రక్షించాలని కోరారు. సదస్సుకు జిల్లాలోని నేతలందరికీ ఆహ్వానం పంపకుండా ఇద్దరు నాయకులు మాత్రమే పెత్తనం చేస్తున్నారంటూ ఆరోపించారు. కళ్యాణదుర్గం తెదేపాలో ఇరు వర్గాల నేతల మధ్య సయోధ్య కుదుర్చలేకపోతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు.
'' ముందు కార్యకర్తల గురించి మాట్లాడండి. వారితో మీటింగ్ పెట్టండి. ఎన్టీ రామారావు కాలం నుంచి హంద్రీనీవా సమస్య అలాగే ఉంది. ఇప్పుడు హంద్రీనీవా కాదు కార్యకర్తల గురించి మాట్లాడాలి. కార్యకర్తలతో వెళ్లండి. చంద్రబాబు కుమారుడు లోకేశ్‌నే జైల్లో వేసే పరిస్థితి ఉంది.'' - జేసీ ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్
ఇదీ చదవండి:
'జగన్ పాలనలో రాయలసీమ నీటి ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకం'