రాష్ట్రంలో పార్లమెంట్ స్థాయిలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి.. నిరుద్యోగులకు పరిశ్రమలలో ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి రజిత్ భార్గవ్ స్పష్టంచేశారు. అనంతపురం జిల్లా హిందూపురంలోని సప్తగిరి కళాశాలలో జిల్లాస్థాయి పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్ సుబ్రహ్మణ్యం, అనంతపురం కలెక్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రిన్సిపల్ కార్యదర్శి మాట్లాడుతూ.. ఐదేళ్లలో సంక్షేమంతో కూడిన పరిశ్రమల అభివృద్ధి చేపడతామనీ.. కాలుష్య రహిత పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రభుత్వ భూములు సేకరించి ఇస్తామన్నారు. హిందూపూర్ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటు కోసం సేకరించిన భూముల్లో ఇప్పటివరకు వరకు ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు చేయలేదని రైతు సంఘం నాయకులు ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించి ఉంటే ప్రభుత్వం భూములు వెనక్కి తీసుకుంటుందని వివరించారు. రాష్ట్రంలో సులభతర పరిశ్రమల ఏర్పాటుకు ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు.
ఇవీ చదవండి..