ETV Bharat / state

పాల వ్యాన్​లో మద్యం తరలింపు..రూ. 10లక్షల విలువైన సరకు పట్టివేత - ananthapuram news

ఎన్నిసార్లు పోలీసులకు చిక్కినా అక్రమంగా మద్యం రవాణా చేసేందుకు అక్రమార్కులు కొత్త కొత్త ఎత్తులు వేస్తూనే ఉన్నారు. తాజాగా కర్ణాటక నుండి అక్రమంగా ఏపీలోకి మద్యం తరలించేందుకు ప్రయత్నించి పోలీసులకు పట్టుబడ్డారు. అనంతపురం జిల్లా విడపనకల్ మండలం డోనేకల్ అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద పాల వ్యానులో అక్రమంగా తరలిస్తున్న 10 లక్షల విలువగల మద్యాన్ని సెబ్​ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

illegal liquor sezied
అక్రమ మద్యం రవాణా.
author img

By

Published : Aug 14, 2021, 11:34 AM IST

కర్ణాటక నుండి అక్రమంగా ఏపీలోకి మద్యం తరలించేందుకు అక్రమార్కులు చేసిన ప్రయత్నానికి పోలీసులు చెక్ పెట్టారు. అనంతపురం జిల్లా విడపనకల్ మండలం డోనేకల్ అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద పాల వ్యానులో అక్రమంగా తరలిస్తున్న రూ.10 లక్షల విలువగల మద్యాన్ని సెబ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ముగ్గురు వ్యక్తులు పాల సరఫరా పేరుతో మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. కర్నూలు జిల్లా డోన్​కు చెందిన రాము, చంద్ర, రాజు, శ్రీనిధి పాల సరఫరా పేరుతో వ్యానును ఏర్పాటు చేసుకుని మద్యాన్ని తరలించడానికి వాహనంలో సగభాగాన్ని ప్రత్యేకంగా తయారు చేయించుకున్నారు. మిగతా సగభాగంలో పాల ప్యాకెట్లు ఉంచుతున్నారు.

ముందస్తు సమాచారం అందుకున్న తనిఖీ కేంద్రం సిబ్బంది, ఎస్​పివోలు.. పాల వ్యాను రాగానే క్షుణ్నంగా తనిఖీలు చేసి 6576 కర్ణాటక మద్యం, టెట్రా ప్యాకెట్లతో పాటు 84 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మద్యం విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ.10 లక్షల వరకు ఉంటుందని సెబ్ అధికారులు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.

ఇదీ చదవండి :

Blackmail: మాటలతో కవ్వించి.. నగ్నంగా కనిపించి.. ఆపై బెదిరించి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.