ETV Bharat / state

LIQUOR SEIZED: సెప్టిక్​ ట్యాంక్ అనుకుంటున్నారా? మీరే చూడండి.. - illegal liquor seized in prakasham district

అక్రమ మద్యం రవాణాకు అక్రమార్కులు కొత్త పుంతలు తొక్కుతున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు సెప్టిక్ ట్యాంక్​ వాహనాన్ని ఉపయోగించారు. మరోచోట పాల వ్యానులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జరిపిన తనిఖీల్లో భారీగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

illegal liquor seized
అక్రమ మద్యం పట్టవేత
author img

By

Published : Jun 11, 2021, 8:26 PM IST

పలు జిల్లాల్లో స్పెషల్​ ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్నారు. నాటు సారా తయారీకి ఉపయోగించే బెల్లం ఊటను ధ్వంసం చేశారు.

అనంతపురం జిల్లాలో..

అనంతపురం జిల్లా పెనుకొండ మండలం మావటూరు గ్రామం వద్ద పోలీసులు.. అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్నారు. కర్ణాటక నుండి ఎవరికీ అనుమానం రాకుండా సెప్టిక్ ట్యాంక్​ వాహనంలో తరలిస్తున్న 1392 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని..ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మద్యం విలువ రూ.3 లక్షల ఉంటుందన్నారు.

ప్రకాశం జిల్లాలో..

ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలో నాటు సారా తయారీకి సిద్ధంగా ఉన్న 2400 లీటర్ల బెల్లం ఊటను పోలీసులు ధ్వంసం చేశారు. నాటు సారా తయారీకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గుంటూరు జిల్లాలో..

గుంటూరు జిల్లా కొల్లూరు మండలంలో ఎస్​ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. నాటు సారా తయారీకి సిద్ధంగా ఉన్న 840 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. తిప్పర్తి నుంచి రొంపిచర్లకు పాల వ్యానులో అక్రమంగా తరలిస్తున్న 1,438 మద్యం సీసాలను దాచేపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన మద్యం రూ.2.10 లక్షలు విలువ చేస్తుందన్నారు.

ఇదీ చదవండి

'కరకట్ట వెంట చేపట్టిన ఇసుక తవ్వకాలను నిలిపివేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.