అనంతపురం జిల్లా పెనుగొండ మండలంలోని కొండపల్లిలో.. కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ వ్యవహారాన్ని పోలీసులు గుర్తించారు.
ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి.. వారి నుంచి మద్యం, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పెనుగొండ ఎస్ఐ హారున్ బాషా హెచ్చరించారు.
ఇదీ చదవండి: