అనంతపురం జిల్లా పుట్టపర్తిలో చిత్రావతి నదిపై నిర్మించిన అక్రమకట్టడాల కూల్చివేత వివాదాస్పదంగా మారింది. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారంటూ కొందరు ఆందోళనకు దిగారు. కనీసం ఇంటిలో సామాన్లను కూడా తీసుకోనివ్వకుండా కూల్చివేస్తున్నారని బాధితులు ఆరోపించారు. ఇదేం దౌర్జన్యం అని అడిగితే విచక్షణారహితంగా దాడి చేశారన్నారు. వైకాపా నాయకులు ప్రోద్బలంతోనే ఇదంతా చేస్తున్నారని బాధితులు వాపోయారు.
ఇదీ చదవండి :