ETV Bharat / state

వేట కొడవలితో భార్యను నరికి చంపిన భర్త

కుటుంబ కలహాలతో భార్యను అతి కిరాతంగా హత్య చేశాడో వ్యక్తి. అడ్డొచ్చిన బంధువులను సైతం తీవ్రంగా గాయపరిచి పారిపోయాడు.

వేట కొడవలితో భార్యను నరికి చంపిన భర్త
author img

By

Published : May 27, 2019, 12:33 PM IST

వేట కొడవలితో భార్యను నరికి చంపిన భర్త

అనంతపురం జిల్లా అమిద్యాల గ్రామంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో భార్యను భర్త వేట కొడవలితో నరికి అతి దారుణంగా హత్య చేశాడు. నారాయణ స్వామి-పార్వతి దంపతులు అమిద్యాల గ్రామంలో నివాసముంటున్నారు. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త నారాయణ స్వామి తన భార్య పార్వతిని (40) సోమవారం తెల్లవారుజామున వేట కొడవలితో నరికి హత్య చేశాడు. పక్కనే ఉండే సమీప బంధువులు అడ్డు రావడంతో వారిపైనా కొడవలితో దాడి చేశాడు. దీంతో మునీంద్ర, రాజు అనే వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని పోలీసుల వాహనంలోనే హుటాహుటిన ఉరవకొండ ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. హత్యానంతరం నిందితుడు పరారయ్యాడు. పోలీసులు హత్య వెనుక కారణాలను వెలికి తీస్తున్నారు.

Intro:నోట్ ఈ వార్తను ఈటీవీ ఆంధ్ర ప్రదేశ్ కు పంపగలరు.
కంట్రీ బ్యూటర్: కె శ్రీనివాసులు
సెంటర్: కదిరి
జిల్లా : అనంతపురం
Ap_Atp_46_27_Kathak_Dance_At_Temple_AV_C8

Body:భారతీయ సంప్రదాయ కళలను కాపాడుకోవడం అందరి బాధ్యత అని పలువురు వక్తలు అన్నారు. అనంతపురం జిల్లా కదిరి ప్రాంతంలోని అనాథ, వలస బాధిత పిల్లలకు శాస్త్రీయ నృత్యం పై శిక్షణ ఇచ్చారు. తల్లిదండ్రులు ఇళ్ల వద్ద లేని చిన్నారుల వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా ఢిల్లీకి చెందిన నృత్య కళాకారిణి అను గుప్తా చేత కథక్ మృత్యం పై శిక్షణ ఇప్పించారు. శిక్షణ ద్వారా పిల్లలకు మన ప్రాచీన కళలను పరిచయం చేయడంతో పాటు వారిలో మనో వికాసానికి మార్గం చూపినట్లు అవుతుందని రెడ్స్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షరాలు భానుజ అన్నారు.

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.