అనంతపురం జిల్లా విరుపాపల్లి గేటు సమీపంలో నిర్మాణంలో ఉన్న హంద్రీనీవా కాలువ వద్ద ప్రమాదం జరిగింది. బెలుగుప్ప పోలీస్ స్టేషన్లో విధులు ముగించుకున్న హెడ్ కానిస్టేబుల్ సూరి... తిరిగి కళ్యాణదుర్గం వైపు ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్నాడు. ప్రమాదవశాత్తు నిర్మాణంలో ఉన్న హంద్రీనీవా కాలువలో పడి సూరి మృతి చెందాడు. అక్కడ ఎటువంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో తరుచు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. అధికారులు ఇప్పటికైనా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కానిస్టేబుల్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సౌమ్యుడు, మంచి పోలీసుగా పేరు తెచ్చుకున్న సూరి మృతితీరని లోటని డీఎస్పీ అన్నారు.
ఇదీ చదవండి:
పెళ్లి చెడగొట్టారని ఓ వ్యక్తి వీరంగం... మద్యం తాగి మహిళను చంపిన వైనం...