ETV Bharat / state

చిత్రావతి నిర్వాసితుల పునరావాసానికి రూ.240 కోట్లు - అనంతపురం చిత్రావతి రిజర్వాయర్ తాజా వార్తలు

అనంతపురం జిల్లాలోని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్వాసితులకు రూ.240.53 కోట్లు పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం పాలనానుమతులు ఇచ్చింది. చిత్రావతి రిజర్వాయర్​లో 10 టీఎంసీలు నీటిని నింపేందుకు వీలుగా అవసరమైన పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు ఈ పరిహారాన్ని మంజూరు చేశారు.

చిత్రావతిచిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాజర్

author img

By

Published : Oct 3, 2020, 4:11 AM IST

అనంతపురం జిల్లాలోని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్​ నిర్వాసితులకు పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతి తెలిపింది. పునరావాస పరిహార ప్యాకేజి కింద రూ. 240.53 కోట్లు చెల్లించేందుకు పాలనానుమతి ఇచ్చింది. సీబీఆర్ ప్రాజక్ట్​లో మొత్తం 10 టీఎంసీలు నిల్వ సామర్థ్యం పెంపు కోసం పరిహారం చెల్లించనున్నారు.

2013 భూసేకరణ చట్టం ప్రకారం ముంపు గ్రామాల్లో భూ సేకరణతో పాటు నిర్వాసితులకు ఈ మొత్తాన్ని జలవనరుల శాఖ చెల్లించనుంది. తాడిమర్రి, ముగుదిబ్బ మండలాల్లోని నిర్వాసిత గ్రామాలలోని 1729 కుటుంబాలను ఖాళీ చేయించేందుకు వీలుగా ఈ మొత్తాన్ని మంజూరు చేశారు.

ఇదీ చదవండి : పోతిరెడ్డిపాడు విస్తరణ ఆపేలా ఆదేశాలివ్వండి : తెలంగాణ సీఎం కేసీఆర్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.