అనంతపురం జిల్లా ప్రజల నుంచి కిలోకి పైగా బంగారం, కోటికి పైగా నగదుతో ఉడాయించిన గోల్డ్ షాప్ యజమాని ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డి.హిరేహల్ మండలం గొడిశలపల్లిలో శ్రీసాయి జువెలరీ, వర్క్ యజమాని సుదర్శనాచారి 200 మందికి టోకరా వేశారు. కిలో పైగా బంగారం, కోటికి పైగా నగదుతో ఉడాయించాడు. నాలుగు రోజుల కిందట ఊరు విడిచి పరారయ్యాడు.
విషయం తెలుసుకున్న 34 బాధితులు డి.హిరేహాల్ పోలీసు స్టేషన్కు చేరుకుని పిర్యాదు చేశారు. వీరిలో 22 మంది వరకు కిలో పైగా బంగారం కోసం అడ్వాన్స్, రిపేర్లకు బంగారం ఇచ్చిన వారు కాగా, 20 మంది నగదు రూ.51 లక్షలు అప్పు, చే బదుళ్లు ఇచ్చారు. ఇంకా గ్రామంలో మహిళా బాధితులు వంద మందికి పైగా ఉన్నట్లు సమాచారం. అంతా కలసి సుమారు మొత్తం ఒకటిన్నర కోటిరూపాయలు మేర మోసపోయినట్లు తెలియజేశారు.
బిడ్డల పెళ్లిళ్లు కోసం నగదు చెల్లించి గోల్డ్ ఆర్డర్ ఇచ్చిన వారు కొందరైతే, రిపేరుకు ఇచ్చిన వారు మరి కొందరు. అలాగే నమ్మకంతో అప్పు ఇచ్చి మోసపోయిన వారు అనేక మంది ఉన్నట్లు తెలిపారు. బాధితులు వేమరెడ్డి, వీరారెడ్డి, శివారెడ్డి, భాస్కర రెడ్డి , గోవిందరెడ్డి, దేవరాజు, మల్లయ్య, తిప్పేస్వామి, ఆనందరెడ్డి, రామకృష్ణ కాదలూరు మల్లి తదితరులు ఎస్సైని కలిశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కంసల సుదర్శనాచారి, అతని మామ శ్రీరాములుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వలిబాషా తెలిపారు.
ఇదీ చూడండి:
రేషన్ కార్డుల తొలగింపు ప్రచారంలో వాస్తవం లేదు: మంత్రి కొడాలి