ETV Bharat / state

నిండుకుండలను తలపిస్తున్న జలాశయాలు..!

మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని జలాశయాలన్నీ నిండిపోయాయి. అనంతపురం జిల్లాలోని సీజీ ప్రాజెక్టు, పెడబల్లి జలాశయంతో పాటు వాగులు, వంకలన్నీ పొంగిపొర్లుతున్నాయి.

full-water-in-anathapuram-reservoirs
నిండుకుండలను తలపిస్తున్న అనంతపురంలోని జలాశయాలు
author img

By

Published : Oct 10, 2021, 2:10 PM IST

మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో రాష్ట్రంలోని జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోని సీజీ ప్రాజెక్టు, పెడబల్లి జలాశయంతో పాటు చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. వాగులు వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన వల్ల లోతట్టు ప్రాంతాల్లోకి నీరుచేరింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరదల కారణంగా... కోతకు వచ్చిన వరి పంట పూర్తిగా దెబ్బతింది. అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చూడండి: MAA Elections 2021: ఓటేసిన తర్వాత చిరు, పవన్ ఏం మాట్లాడారంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.